RamCharan: బంగారం బహుమానం

తన మనసు బంగారం అని చాటుకున్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా కోసం పని  చేసిన వివిధ సాంకేతిక విభాగాల ముఖ్యులు, సహాయకులకి ఒకొక్కరికి తులం బరువున్న బంగారు నాణేల్ని  కానుకగా అందజేశారు. ఆదివారం

Updated : 04 Apr 2022 13:28 IST

న మనసు బంగారం అని చాటుకున్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా కోసం పని  చేసిన వివిధ సాంకేతిక విభాగాల ముఖ్యులు, సహాయకులకి ఒకొక్కరికి తులం బరువున్న బంగారు నాణేల్ని  కానుకగా అందజేశారు. ఆదివారం ఉదయం చిత్రబృందంలోని 35 మందిని తన ఇంటికి అల్పాహారం కోసం ఆహ్వానించి, వాళ్లకి బంగారు నాణేల్ని కానుకగా    అందజేశారు. సినిమా అద్భుతంగా రావడంలో మీ పాత్ర ఎంతో ఉందంటూ ఈ సందర్భంగా ఆ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రికార్డుస్థాయి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని