Ram charan: ఎన్టీఆర్ కల కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం: రామ్ చరణ్
ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నడం తనకు దక్కిన గౌరవమని రామ్ చరణ్ (Ram charan) అన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్: నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి ఉత్సవాలు ఏడాది నుంచి వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram charan) పాల్గొని ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ఇక ఈ వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ ట్విటర్ ద్వారా తెలిపారు.
ఈ విషయంపై ట్వీట్ చేసిన రామ్ చరణ్ ‘‘తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నుంచే నేర్చుకున్నాను. ఆయన కలను సజీవంగా ఉంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ స్పీచ్, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఇక శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రామ్ చరణ్.. రాముడు, కృష్ణుడి గురించి మాట్లాడలేమని వారిని అనుభూతి చెందాలి అని అన్నారు. ప్రతి సినిమా సెట్‌లోనూ ఆయన్ని గుర్తుచేసుకోని ఆర్టిస్టులు ఉండరని చెప్పారు. తెలుగు సినిమాకు, తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ఉంటుందని తెలిపారు. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ తనకు ప్రత్యేకంగా టిఫిన్ పెట్టిన్నట్లు గుర్తుచేసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ కొంత కఠినమే..
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం