Acharya: ‘ఆచార్య’ రిజల్ట్‌.. ఆదుకునే పనిలో రామ్‌చరణ్‌?

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే.

Published : 12 May 2022 19:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. చిరంజీవి-రామ్‌చరణ్‌ కలిసి నటిస్తుండటం, కొరటాల శివ దర్శకత్వం వహించటంతో సినిమా కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలూ ఆసక్తిగా ఎదురు చూశాయి. కానీ, ఫలితం మరోలా వచ్చింది. అగ్ర కథానాయకుల సినిమాల అనుకున్న ఫలితం రానప్పుడు వారే స్వయంగా రంగంలోకి దిగి డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్‌చరణ్‌  ఆ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్‌. ‘ఆచార్య’ వల్ల వచ్చిన నష్టాలను కొంత భరించి ఆదుకుంటానని డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌కు చరణ్ హామీ ఇచ్చారట. త్వరలోనే వాళ్లందరినీ కలిసి మాట్లాడనున్నారని తెలుస్తోంది.  ఈ సినిమాకు మంచి ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఫలితం తారుమారవడంతో దాదాపు రూ.80కోట్లు నష్టం వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని