RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సమయంలో ఆ విషయంలో కొంత భయపడ్డా: రామ్‌ చరణ్‌

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్ (Ram Charan)‌, ఎన్టీఆర్‌ (NTR) కలిసి నటించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించేటప్పుడు పోటీ ఉంటుందేమోనని రామ్‌ చరణ్‌ భయపడినట్లు చెప్పారు. 

Published : 10 Feb 2023 01:33 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనగానే గుర్తొచ్చేవారిలో రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ ముందుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) కంటే ముందే తమ మధ్య స్నేహబంధం ఉందని పలు సందర్భాల్లో వీళ్లిద్దరూ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో భీమ్‌గా తారక్‌, రామ్‌గా రామ్‌ చరణ్‌ ఇద్దరూ పోటీపడి నటించారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లోనూ రాజమౌళి కూడా వీరి స్నేహం గురించి చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్‌ చరణ్‌ (Ram Charan) మాట్లాడుతూ ఎన్టీఆర్ ‌(NTR)  గురించి ఆసక్తిగల విషయాలు పంచుకున్నారు.

ఎన్టీఆర్‌కు ప్రత్యర్థిగా నటించడం మీకు ఎలా అనిపించింది? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ..‘‘ఎలాంటి సన్నివేశం అయినా రాజమౌళి (SS Rajamouli) బాగా చిత్రీకరించగలరు. నేనూ ఎన్టీఆర్‌ ఎన్నో సంవత్సరాలుగా స్నేహితులం. కొన్ని సీన్స్‌లో నటించేటప్పుడు ఎవరు బాగా చేస్తారనే దాని గురించి పోటీ ఉంటుందేమోనని నేను కొంత భయపడ్డాను. కానీ వృత్తిపరంగా మా మధ్య ఎప్పుడూ పోటీలేదు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సమయంలో ఎన్నో విషయాలు పంచుకున్నాం.  చాలా సౌకర్యంగా షూటింగ్‌ పూర్తిచేశాం. మా మధ్య పోటీ అనేది ఎప్పుడూ సమస్య కాలేదు.  ఇక రాజమౌళికి అభిమానుల అంచనాలను ఎలా బ్యాలెన్స్‌ చేయాలో బాగా తెలుసు’’ అని చెప్పారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పటికే ఈ సినిమా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ ‌(Oscar) బరిలో నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని