RC16: ఆగిపోయిన రామ్‌చరణ్ 16వ సినిమా..!
జెర్సీ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్: రామ్ చరణ్ (Ram charan) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. RC16గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఆగిపోయిందనే వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఈ వార్తపై చిత్ర వర్గాలు అధికారికంగా క్లారిటీ ఇచ్చాయి. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ట్విటర్ వేదికగా ప్రకటించాయి.
‘‘మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరిల ప్రాజెక్టు ఆగిపోయింది. అతి త్వరలోనే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం’’ అని ట్వీట్ చేసింది. అయితే.. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయంపై మాత్రం ఎలాంటి వివరణ లేదు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలకపాత్రలు పోషింస్తుండగా తమన్ స్వరాలు అందించనున్నారు. మరోవైపు గౌతమ్ తిన్ననూరి యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఆ కథేంటి? రామ్‌చరణ్ కోసం సిద్ధం చేసిన కథే.. విజయ్‌తో తీస్తారా? లేదా కొత్తదా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ..!
-
General News
TS High Court: గవర్నర్ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య
-
Movies News
Kailash Kher: సింగర్ కైలాశ్ ఖేర్‌పై వాటర్ బాటిళ్లతో దాడి..