Ram Charan: ‘ఇదీ రామ్‌చరణ్‌ డెడికేషన్‌ అంటే’.. వర్కౌట్‌ వీడియోకు ఫ్యాన్స్‌ ఫిదా

రామ్‌చరణ్‌ పంచుకున్న వర్కౌట్‌ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

Published : 17 Nov 2022 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత్రలు సవాలు విరిసితే దాన్ని స్వీకరించి, అభిమానులను అలరించేందుకు ముందుండే నటుల్లో రామ్‌చరణ్‌ (Ram Charan) ఒకరు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజుగా కనిపించి, విశేషంగా ఆకట్టుకున్న ఆయన ఆ క్యారెక్టర్‌ కోసం ఎంతగా శ్రమించారో తెలిసిందే. ఇప్పుడు కొత్త చిత్రం #RC15 (వర్కింగ్‌ టైటిల్‌) లోని పవర్‌ఫుల్‌ పాత్ర కోసం నిర్విరామంగా కసరత్తులు చేస్తున్నారు. సంబంధిత వీడియోను చరణ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అది క్షణాల్లోనే లక్షల లైక్స్‌ సొంతం చేసుకుంది. అందులో.. ఓ శిక్షకుడి పర్యవేక్షణలో బరువులు ఎత్తుతూ, ఫుట్‌బాల్‌ ఆడుతూ, స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ కనిపించారు చరణ్‌. ‘తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణకు అంతా సిద్ధం. వర్కౌట్‌కి వెకేషన్‌ లేదు’ అని ఆయన వ్యాఖ్యానించడంతో అభిమానులు ప్రశంసిస్తున్నారు. ‘డెడికేషన్‌ అంటే ఇది’, ‘సూపర్‌ అన్నా’, ‘లుక్‌ బాగుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘ఆర్‌సీ 15’. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్‌. జె. సూర్య, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని