రామ్‌ కొత్త సినిమా దర్శకుడికి చిక్కులు

రామ్‌ కథానాయకుడిగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా డైరెక్టర్‌ లింగుస్వామికి చిక్కులు ఎదురయ్యాయి. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞాన్‌వేల్‌ రాజా ఆయనపై తెలుగు నిర్మాతల మండలికి, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు

Published : 26 Jun 2021 15:34 IST

సినిమా పట్టాలెక్కడానికి ఆలస్యమవుతుందా?

హైదరాబాద్‌: రామ్‌ కథానాయకుడిగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా డైరెక్టర్‌ లింగుస్వామికి చిక్కులు ఎదురయ్యాయి. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞాన్‌వేల్‌ రాజా ఆయనపై తెలుగు నిర్మాతల మండలికి, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఓ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తానని మాటిచ్చి, లింగుస్వామి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. 

‘స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కిస్తానని లింగుస్వామి గతంలో నాకు మాటిచ్చారు. మాట ప్రకారమే నా వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నారు. ఇప్పటివరకూ మా బ్యానర్‌పై ఎలాంటి చిత్రాన్ని ఆయన ఓకే చేయలేదు. అంతేకాకుండా, ఇప్పుడు ఆయన రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. మా డిమాండ్‌ ఒక్కటే.. లింగుస్వామి ముందు మా బ్యానర్‌లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. ఆయన రామ్‌తో సినిమా చేయడంపై మాకెలాంటి సమస్య లేదు’ అని జ్ఞాన్‌వేల్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు