Ram Gopal Varma: అభిమానిగా చిరంజీవికి అప్పుడు విజ్ఞప్తి చేశా: ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిరంజీవి గురించి మాట్లాడారు. 

Published : 07 Dec 2022 01:07 IST

హైదరాబాద్‌: ఓ సామాన్యుడిలానే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటానని, ట్విటర్‌ ఉంది అందుకేనని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) అన్నారు. తన సినిమా ‘డేంజరస్‌’ (తెలుగులో: నా ఇష్టం) ఈ నెల 9న విడుదలకానున్న నేపథ్యంలో  ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ నాటి పరిణామాలను గుర్తు చేసుకున్నారు. సమస్యపైన దృష్టిపెడతానని, వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్‌ చేయనని తెలిపారు. తాను చిరంజీవి కుటుంబంపై ఒక్క సెటైర్‌ కూడా వేయలేదన్నారు.

‘‘చిరంజీవి (Chiranjeevi) రీ ఎంట్రీ కోసం ఎలాంటి సినిమా చేస్తారోనన్న చర్చలు జరుగుతున్నప్పుడు ఓ అభిమానిగా ఆయనకు విజ్ఞప్తి చేశా. అదేంటంటే.. ‘బాహుబలి’లాంటి పెద్ద సినిమా చేయమని. ఆయన పెద్ద స్టార్‌ కాబట్టి.. ‘చిన్న సినిమా కాకుండా పెద్ద చిత్రమే తీయండి’ అని అడిగా. అందులో సెటైర్‌ ఏముంది? కొందరు తమకు తామే ఏదో ఊహించుకుంటుంటారు’’ అని రామ్‌గోపాల్‌ వర్మ పేర్కొన్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌లను తాను గౌరవిస్తానన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని