Ram Gopal Varma: రాజమౌళికి ఉన్నంత ఓపిక నాకు లేదు: రామ్‌గోపాల్‌ వర్మ

ఫెయిల్యూర్‌ లేని దర్శకుడంటూ రాజమౌళిని కొనియాడారు రామ్‌గోపాల్‌ వర్మ. అందరికీ నచ్చే పని తానెప్పుడూ చేయనని తెలిపారు.

Published : 24 Oct 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల విషయంలో రాజమౌళి (Rajamouli)కి ఉన్నంత ఓపిక, ప్యాషన్‌ తనకు లేవన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma). అందుకే భారీ బడ్జెట్‌తో సినిమాలు తాను చేయనని చెప్పారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజమౌళి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్క ఫెయిల్యూర్‌ కూడా లేని దర్శకుడంటూ రాజమౌళిని కొనియాడారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి చిత్రాలను తెరకెక్కించటం తపస్సులాంటిదన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రాజమౌళి సినిమాలను తెరకెక్కిస్తారని, అందుకే అన్నీ పెద్ద విజయం అందుకున్నాయని వివరించారు. అందరికీ నచ్చే పని తానెప్పుడూ చేయనని రామ్‌గోపాల్‌ వర్మ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని