Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ రాజకీయ ‘వ్యూహం’.. శపథం!
ట్విటర్ వేదికగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అది రాజకీయ కథాంశంతో తెరకెక్కనుంది.
ఇంటర్నెట్ డెస్క్: తన తదుపరి చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘వ్యూహం’ పేరుతో తొలి భాగాన్ని, ‘శపథం’ పేరుతో రెండో భాగాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ‘‘అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన ‘వ్యూహం’ కథ.. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రెండు పార్ట్‌ల్లోనూ రాజకీయ అరాచకాలు ఉంటాయి. ప్రేక్షకులు తొలి చిత్రం షాక్ నుంచి తేరుకునేలోపే వారికి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ పార్ట్ 2 రూపంలో తగులుతుంది. నేను గతంలో తీసిన ‘వంగవీటి’ సినిమా నిర్మాతే ఈ కొత్త చిత్రాన్నీ నిర్మిస్తున్నారు’’ అని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.
‘‘ఇది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్‌పిక్. బయోపిక్‌లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్‌లో అన్నీ నిజాలే ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఏపీ సీఎంతో సమావేశమై తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆర్జీవీని ‘భేటీ దేని గురించి’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. తాను తీయబోయే సినిమా గురించి చర్చించేందుకే ఆర్జీవీ.. సీఎంను కలిశారంటూ వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ఈ ట్వీట్‌తో ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చినట్టయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు