రామ్‌గోపాల్‌వర్మ సోదరుడు సోమశేఖర్‌ మృతి

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడు పి.సోమశేఖర్‌ కరోనాతో కన్నుమూశారు. ఆయన పలు సినిమాలకు పనిచేశారు. రంగీలా, దౌడ్‌‌, సత్య, జంగిల్‌, కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హిందీలో ‘ముస్కురాకే దేఖ్‌ జరా’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో ఆయన చాలాకాలంగా రామ్‌గోపాల్‌వర్మకు దూరంగా ఉంటున్నారు.

Published : 24 May 2021 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్‌ కరోనాతో కన్నుమూశారు. ఆయన పలు సినిమాలకు పనిచేశారు. రంగీలా, దౌడ్‌‌, సత్య, జంగిల్‌, కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హిందీలో ‘ముస్కురాకే దేఖ్‌ జరా’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో ఆయన చాలాకాలంగా రామ్‌గోపాల్‌వర్మకు దూరంగా ఉంటున్నారు.

తన జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో సోమశేఖర్‌ ఒకరని, అతడిని చాలా మిస్‌ అవుతున్నానని ఆర్జీవీ చెప్తుండేవారు. ‘సత్య’ చిత్రీకరణ సమయంలో ఆర్జీవీ కంటే శేఖర్‌ను చూస్తేనే ఎక్కువ భయం వేసేదని ప్రముఖ హీరో జేడీ చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. సోమశేఖర్‌ మృతిపై బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన తల్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని, కరోనా సోకిన తర్వాత కూడా తల్లి కోసం ఎంతో పరితపించేవాడన్నారు. తన తల్లిని కాపాడగలిగాడు గానీ.. తన ప్రాణాలు దక్కించుకోలేకపోయాడని బోనీ కపూర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని