Covid files: కరోనా సెకండ్‌ వేవ్‌ వెనుక ఉన్నదెవరు? ఆర్జీవీ ‘కొవిడ్‌ ఫైల్స్‌’

వాస్తవ సంఘటనలు, నిజ జీవిత వ్యక్తుల లైఫ్‌ స్టోరీని సినిమాలుగా తీయడంలో సిద్ధహస్తుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram gopal varma). 

Published : 22 Jul 2022 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాస్తవ సంఘటనలు, నిజ జీవిత వ్యక్తుల లైఫ్‌ స్టోరీని సినిమాలుగా తీయడంలో సిద్ధహస్తుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram gopal varma). ఇప్పుడు మరో సరికొత్త అంశాన్ని తెరపైన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వైరస్‌తో యావత్‌ ప్రపంచం చిగురుటాకుల వణికిపోయింది. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఆప్తులను దూరం చేసింది. మళ్లీ అలాంటి పరిస్థితులను ఊహించడానికైనా సిద్ధంగా లేని ఘటనలతో ఆర్జీవీ తీస్తున్న చిత్రం ‘కొవిడ్‌ ఫైల్స్‌’ (Covid files). కరోనా సమయంలో దేశం ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను కళ్లకు కట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు పెట్టారు.

‘‘భయానక సెకండ్‌వేవ్‌ వెనుక ఉన్న కుట్రదారు కరోనా వైరస్‌ కాదు. అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. దాన్ని ‘కొవిడ్‌ ఫైల్స్‌’ నిరూపిస్తుంది. లక్షలమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అవినీతి, నిర్లక్ష్యపూరిత, అయోగ్యమైన పరిపాలన యంత్రాంగం తీరును ఈ చిత్రం బట్టబయలు చేస్తుంది. ఇదొక రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రం. ఇందులో చూపించే కఠోర వాస్తవాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పించడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావాన్ని ‘కొవిడ్‌ ఫైల్స్‌’ చూపిస్తుంది’’ అని వర్మ ట్వీట్‌ చేశారు. అయితే, ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారా? లేక కేవలం పర్యవేక్షణ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే, నటీనటులు, సాంకేతిక బృంద వివరాలను కూడా వర్మ వెల్లడించలేదు. ఇటీవల ‘అమ్మాయి’ చిత్రంతో వర్మ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని