RGV: రాజమౌళి సహా ఎవరూ దీన్ని ఊహించి ఉండరు: రామ్‌గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి గురించి వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేసిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కే నుంచి ఇప్పటి వరకూ ఎవరూ (రాజమౌళి సహా) ఊహించి ఉండరు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు సినీ అభిమానులు స్పందించారు. ‘మిమ్మల్నీ ఇలా చూడాలనుకుంటున్నాం’, ‘మీదీ అదే రేంజ్ సర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) అవార్డు వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగిన ఆ వేడుకలో రాజమౌళి (Rajamouli), సంగీత దర్శకుడు కీరవాణి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఆ పర్యటనలోనే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ను రాజమౌళి, కీరవాణి కలిశారు. వారి సంభాషణా వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ శవివారం సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. దాన్ని రీట్వీట్ చేసిన రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
EarthQuake: నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి..!
-
Crime News
Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త
-
Movies News
Bollywood: స్టార్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లు
-
Sports News
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుడ్‌బై!
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే