RGV: మహేశ్‌ ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు: వర్మ

బాలీవుడ్‌ గురించి మహేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. మహేశ్‌ చేసిన కామెంట్స్‌కు అర్థమేమిటో తనకు తెలియలేదని...

Published : 12 May 2022 13:55 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ గురించి మహేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. మహేశ్‌ చేసిన కామెంట్స్‌కు అర్థమేమిటో తనకు తెలియలేదని ఆయన అన్నారు. బాలీవుడ్‌ తనని భరించలేదంటూ ‘మేజర్’ ట్రైలర్‌ ఈవెంట్‌లో మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడంతటా వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహేశ్‌ కామెంట్స్‌పై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అసహనంగా ఉన్నారని ఆంగ్ల పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్‌ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ బాలీవుడ్ అనేది ఒక సంస్థ కాదని అన్నారు. ‘‘ఎక్కడ సినిమాలు చేయాలి? ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనేది ఒక నటుడి సొంత నిర్ణయం. దానిని తప్పుపట్టడానికి లేదు. కానీ, తనని బాలీవుడ్‌ భరించలేదంటూ మహేశ్‌ చేసిన వ్యాఖ్యల్లో అర్థమేమిటో నాకు తెలియడం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే.. బాలీవుడ్‌ అనేది కేవలం ఒక కంపెనీ కాదు. మీడియా వాళ్లే ఆ పేరు సృష్టించారు. నిర్మాత, ప్రొడెక్షన్‌ కంపెనీ మాత్రమే తమ చిత్రాల్లో నటించమని కోరుతూ నటీనటులకు డబ్బులు ఇస్తుంటారు. అలాంటప్పుడు బాలీవుడ్‌ మొత్తాన్ని జనరలైజ్‌ చేసి ఎలా చెబుతాం. అది నాకు అర్థం కావడం లేదు’’ అని వర్మ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని