Ram Gopal Varma: నటుడిగా రామ్‌గోపాల్‌ వర్మ.. ‘కల్కి’ టీమ్‌కు థ్యాంక్స్‌

‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఎందుకంటే?

Published : 28 Jun 2024 00:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడిగా సుదీర్ఘ ప్రస్థానమున్న రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో తెరంగేట్రం చేశారు. అందులో చిన్న పాత్ర పోషించి, అలరించారు. ఈ సినిమాలో ఆయన నటించినట్టు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిందే తప్ప చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో, అదంతా రూమరే అని చాలామంది సినీ అభిమానులు అనుకున్నారు. కట్‌చేస్తే, గురువారం విడుదలైన ఆ మూవీలో ఆర్జీవీని చూసిన వారంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో కలిసి నటించారాయన. తనకు అవకాశం ఇచ్చిన ‘కల్కి’ టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. దర్శకుడు, నటులను ప్రశంసించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

ప్రభాస్‌ 1000 రెబల్‌ స్టార్లతో సమానం: శ్యామలా దేవి కామెంట్స్‌

‘‘నాగ్‌ అశ్విన్‌.. మీ ఆశయం, ఊహ అద్భుతం. అమితాబ్‌ బచ్చన్‌ గతంలో కంటే 100 రెట్లు డైనమిక్‌గా కనిపించారు. ప్రభాస్‌ కొత్త అవతార్‌ అదుర్స్‌. నన్ను నటుడిగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు ఆర్జీవీకి శుభాకాంక్షలు తెలిపారు.

‘కల్కి’ బృందానికి చిరంజీవి విషెస్‌

‘కల్కి’పై మంచి రివ్యూస్‌ వస్తున్నాయంటూ చిత్ర బృందానికి నటుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా టీమ్‌ని అభినందించారు. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణెలతో మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ తెరకెక్కించడంపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను కొనియాడారు. అశ్వనీదత్‌ను తనకు ఇష్టమైన నిర్మాతగా పేర్కొంటూ ఆయన్ను, చిత్ర నిర్మాణంలో భాగమైన ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్నలకు ప్రత్యేకంగా కంగ్రాట్స్‌ చెప్పారు.

‘కల్కి 2898 ఏడీ’ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని