#RaPo19 కథ నచ్చేసింది.. రోల్‌ కెమెరా

ప్రముఖ కథానాయకుడు రామ్‌ పోతినేని ‘రెడ్‌’ విజయం ఇచ్చిన జోష్‌ను కొనసాగిస్తున్నారు. అదే ఊపులో ఈసారి ఏకంగా ద్విభాష చిత్రంతో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్‌ లింగుస్వామితో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా హీరో రామ్‌కు డైరెక్టర్‌ లింగుస్వామి కథ వినిపించారట.

Published : 24 Jun 2021 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు రామ్‌ పోతినేని ‘రెడ్‌’ విజయం ఇచ్చిన జోష్‌ను కొనసాగిస్తున్నారు. అదే ఊపులో ఈసారి ఏకంగా ద్విభాష చిత్రంతో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్‌ లింగుస్వామితో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా హీరో రామ్‌కు డైరెక్టర్‌ లింగుస్వామి కథ వినిపించారట. ఆ కథ రామ్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ విషయాన్ని రామ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘కథ చెప్పడం పూర్తయింది. లవ్‌ యూ లింగుస్వామి సర్‌. సూపర్‌ డూపర్‌.. నేను చెప్తున్నా.. రోల్‌ కెమెరా’’ అంటూ రామ్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

రామ్‌ కెరీర్‌లో 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిశెట్టి సందడి చేయనుంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణ. ఈ చిత్రంలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నారట. యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌గా అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు