Ram: ఇంట్లో వాళ్లని నమ్మించాల్సి వస్తోంది.. రూమర్స్‌పై రామ్ ట్వీట్
హైదరాబాద్: సోషల్‌మీడియాలో తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై నటుడు రామ్ పోతినేని (Ram Pothineni) స్పందించారు. వాటి వల్ల తాను ఎంతగానో విసిగిపోయానని, అసత్య ప్రచారాల వల్ల అయిన వాళ్లకే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ‘‘ఓరి దేవుడా..!! ఇకనైనా ఆపండి.. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే చివరికి హైస్కూల్ స్వీట్హార్ట్ అంటూ నాకు ఎవరూ లేరని, నేను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదని ఇంట్లోవాళ్లు, ప్రాణమిత్రులను సైతం నమ్మించాల్సి వస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఆ రోజుల్లో నేనస్సలు స్కూల్‌కే సరిగ్గా వెళ్లలేదు’’ అని రామ్ రాసుకొచ్చారు.
రామ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. తన హైస్కూల్ ఫ్రెండ్‌తో ఎంతోకాలంగా సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారని, ఎట్టకేలకు ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంటున్నారని పలు వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో ఆ వార్తలపై రామ్ తాజాగా ట్విటర్లో స్పందించడంతో ఆయన పెళ్లి వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.
సినిమాల విషయానికొస్తే.. రామ్ ప్రస్తుతం ‘ది వారియర్’ (The Warriorr) పోస్ట్ ప్రొడెక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన సత్య అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కృతిశెట్టి కథానాయిక. మరోవైపు, రామ్ ఇటీవల యాక్షన్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో (Boyapati Srinu) కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Indian flag: అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా..!
-
India News
Azadi Ka Amrit Mahotsav: ఆరు ఖండాల్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్..!
-
Movies News
Independence Day: ఒక్క క్షణం.. మన రియల్ హీరోలకు ప్రణమిల్లుదాం
-
India News
Modi: ‘అవినీతి.. వారసత్వం’.. దేశాన్ని పట్టిపీడిస్తోన్న చెదపురుగులు
-
General News
CM KCR: దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్
-
India News
India Corona : 15 వేల కొత్త కేసులు.. 32 మరణాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం