Double Ismart: ‘పుష్ప2’ రిలీజ్ డేట్‌కు రామ్ సినిమా.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

రామ్‌ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల తేదీని ప్రకటించారు. 

Published : 15 Jun 2024 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఒక హీరో సినిమాకు లాక్ అయిన తేదీకి మరొకరి మూవీ రావడం సహజమే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆగస్టు 15వ తేదీ విడుదల కోసం సినిమాలు పోటీపడుతున్నట్లు కనిపిస్తుంది. సుకుమార్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న చిత్రం ‘పుష్ప2’. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుంచి దీని రిలీజ్‌పై రూమర్స్‌ వస్తుండడంతో ఆ తేదీని మరికొన్ని సినిమాలు లాక్‌ చేసుకుంటున్నాయి. 

రామ్‌ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart Movie). మొదట ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని భావించారు. అయితే అప్పటికీ సినిమా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే నాని ‘సరిపోదా శనివారం’ కూడా ఆగస్టు 29న రానుంది. ఇంకా ఈ తేదీకి రెండు నెలల సమయం ఉండడంతో మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ డేట్‌ను మార్చుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

‘డియర్‌ కామ్రేడ్‌’పై పోస్ట్‌ పెట్టిన విజయ్‌ దేవరకొండ.. స్పందించిన రష్మిక

‘పుష్ప2’ (Pushpa2) విషయానికొస్తే.. దీని షూటింగ్‌ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మిగిలే ఉంది. మేకర్స్‌ ఇటీవల ఈ చిత్రం నుంచి పాటను విడుదల చేసినప్పుడు కూడా విడుదల తేదీ ఆగస్టు 15 అనే పేర్కొన్నారు. ఇది లాంగ్ వీకెండ్ కావడంతో ఈ తేదీ కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. చార్మి, పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని