Ram-Boyapati: క్లైమాక్స్ కాదు.. అంతకు మించి.. ఆసక్తిగా రామ్ ట్వీట్
బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రామ్ (Ram pothineni) ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ ఈ మూవీపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
హైదరాబాద్: బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమా అంటే మాస్ ప్రేక్షకులు ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకుంటారు. ఇక అందులో క్లైమాక్స్ సన్నివేశాలైతే అంచనాలకు అందవు. ఈ దర్శకుడు యంగ్ హీరో రామ్‌తో కలిసి ఓ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. #RAM20గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై తాజాగా రామ్ ఓ ట్వీట్ చేశాడు.
‘‘24 రోజుల యాక్షన్ సన్నివేశాలను పూర్తిచేశాం. ఇది క్లైమాక్స్ కాదు.. అంతకు మించి’’ అని అర్థం వచ్చేలా రామ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ‘టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారు’ అని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇటీవలే రామ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా అందులో మాస్ అవతారంలో ఉన్న ఈ యంగ్ హీరో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇక ఇందులో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ తాజాగా డబ్బింగ్ పనులను కూడా షురూ చేసింది. రామ్ ఈ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టనున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి