సెక్షన్లు చెప్పి చుక్కలు చూపించిన రామ్‌!

ఇటీవలే విడుదలై హీరో రామ్‌ ఖాతాలో మరో హిట్‌గా నిలిచిన చిత్రం ‘రెడ్‌’. సస్సెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయంతో ఇరగదీశారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా

Published : 01 Mar 2021 12:02 IST

ఇంటర్‌నెట్‌: ఇటీవలే విడుదలై హీరో రామ్‌ ఖాతాలో మరో హిట్‌గా నిలిచిన చిత్రం ‘రెడ్‌’. సస్సెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో ఆయన‌ ద్విపాత్రాభినయంతో అలరించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా అందులోని కీలకమైన ఇంటరాగేషన్‌ సీన్‌ను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో ఉంచారు. ఇందులో రామ్‌పై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయబోగా ఐపీసీలోని పలు సెక్షన్ల పేర్లు చెప్పి కారణం లేకుండా అనుమానితుడిపై చేయి చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వివరిస్తాడు. దీంతో షాక్‌ అవ్వడం పోలీసుల వంతైంది. అలాగే ఈ సీన్‌కి మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఒక రేంజ్‌లో ఉంది. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించగా మాళవికశర్మ, అమృతా అయ్యర్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటించారు. తమిళ చిత్రం ‘తడమ్‌’ రీమేక్‌గా దీనిని చిత్రీకరిస్తున్నారు. మరి రామ్‌ చెప్పే ఆ ఐపీసీ సెక్షన్లు ఏంటో, ఆ కేసులేంటో తెలుసుకోవాలంటే ఈ సీన్‌ చూసేయండి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని