Ram Setu: అక్షయ్‌కుమార్‌, సత్యదేవ్‌ కాంబో.. ఉత్కంఠగా ‘రామ్‌ సేతు’ ట్రైలర్‌

అక్షయ్‌కుమార్‌, సత్యదేవ్‌ కలిసి నటించిన చిత్రం ‘రామ్‌ సేతు’. ఈ సినిమా ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది.

Published : 11 Oct 2022 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో దర్శకుడు అభిషేక్‌ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రామ్‌ సేతు’ (Ram Setu). సత్యదేవ్‌ (Satya Dev) కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా కథానాయికలు. దీపావళి కానుకగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తుంది’ అంటూ నటుడు నాజర్‌ పరిచయ సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇతిహాసాల్లోని నిజాన్ని వెలికితీసే వ్యక్తిగా అక్షయ్‌ కనిపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. 7000 ఏళ్ల క్రితంనాటి సంగతులు తెలుసుకునే క్రమంలో అక్షయ్‌, సత్యదేవ్‌ చేసిన సాహసం, విలన్ల గ్యాంగ్‌తో పోరాటం.. ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రామసేతు వారధి రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని