Ram Setu: విజువల్స్‌తో కట్టిపడేసిన ‘రామ్ సేతు’ టీజర్
రామ్ సేతు (Ram Setu) విశిష్ఠత, దాన్ని కాపాడేందుకు తన బృందంతో కలిసి ఓ ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న చిత్రం ‘రామ్ సేతు’...
ముంబయి: రామ్ సేతు (Ram Setu) విశిష్టత, దాన్ని కాపాడేందుకు తన బృందంతో కలిసి ఓ ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న చిత్రం ‘రామ్ సేతు’. అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా ఈ సినిమా సిద్ధమైంది. అభిషేక్ శర్మ దర్శకుడు. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ‘‘రామ్ సేతు’ని కాపాడేందుకు మన చేతుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి’’ అని అక్షయ్ చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్.. ఆకట్టుకునే విజువల్స్‌తో కట్టిపడేసేలా ఉంది. రామ్ సేతుని చేరుకోవడానికి తన బృందంతో కలిసి అక్షయ్ చేసే సాహసాలను ఇందులో చూపించారు. తెలుగు హీరో సత్యదేవ్ ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. జాక్వెలిన్ కథానాయిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్