Ram Setu: శ్రీరాముడికి వేలమందిరాలున్నా సేతు ఒక్కటే

నా పని ఇతిహాసాల్లోని నిజాల్ని వెలికితీయడం అంటూ రామ్‌సేతు రహస్యాలను బయటపెట్టడానికి రంగంలోకి దిగారు అక్షయ్‌కుమార్‌. ఆయన పురాతత్వ శాస్త్రవేత్తగా నటించిన చిత్రం ‘రామ్‌సేతు’.

Updated : 12 Oct 2022 07:25 IST

నా పని ఇతిహాసాల్లోని నిజాల్ని వెలికితీయడం అంటూ రామ్‌సేతు (Ram setu) రహస్యాలను బయటపెట్టడానికి రంగంలోకి దిగారు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar). ఆయన పురాతత్వ శాస్త్రవేత్తగా నటించిన చిత్రం ‘రామ్‌సేతు’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తోంది, మనదేశంలో నెలరోజుల క్రితం నాటి రోడ్లే గుంతలు పడిపోతుంటే 7000 సంత్సరాల నాటి చరిత్ర అంత సులువుగా దొరుకుతుందా...లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. సముద్రగర్భంలోకి అక్షయ్‌ వెళ్లే సన్నివేశాలు కనువిందు చేస్తాయి. ఈ ప్రపంచంలో రాముడికి వేల మందిరాలు ఉన్నాయి. కానీ సేతు ఒక్కటే ఉంది అంటూ ట్రైలర్‌లో చివర్లో చెప్పిన డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిషేక్‌ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌, నుస్రత్‌ బరూచా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని