The Warriorr: తెలుగు కమర్షియల్‌ హిట్‌ చిత్రాలకు ఆయనే స్ఫూర్తి: రామ్‌

రామ్‌ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. కృతిశెట్టి కథానాయిక. రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్న ఈ చిత్రం జులై 14న విడుదలకానుంది.

Published : 01 Jul 2022 23:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’ (The Warriorr). ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. కృతిశెట్టి కథానాయిక. రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్న ఈ చిత్రం జులై 14న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురంలోని అనంత లక్ష్మి ఇంజినీరింగ్‌ కాలేజీలో ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించింది చిత్ర బృందం. దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ.. ‘‘లింగుస్వామి చాలా మంచి మనసున్న వ్యక్తి. ఇలాంటి మనిషిని నేనిప్పటి వరకూ కలవలేదు. కమర్షియల్‌గా హిట్‌ అందుకున్న పలు తెలుగు సినిమాల్లోని సన్నివేశాలను లింగుస్వామి చిత్రాల స్ఫూర్తితోనే తీశారు. ఈ విషయాన్ని ఆయా డైరెక్టర్లే నాకు చెప్పారు. ‘తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు అంటే ఏంటో అనంతపురంలో చూశా’ అని ఆయన నాతో అన్నారు. ఆది, కృతిశెట్టితో నటించడం కొత్త అనుభూతినిచ్చింది’’ అని రామ్‌ తెలిపారు. ‘‘అనంతపురంలో ఈవెంట్ అని ‘ది వారియర్‌’ టీమ్‌ చెప్పగానే చాలా సంతోషించా. ఎందుకంటే సీమ అంటే నా సొంత ఇల్లు అనేది నా ఫీలింగ్‌. మీకూ నాకూ ఉన్న అనుబంధం అలాంటిది. మీ అభిమానం అలాంటిది. ఇక్కడి వారు బోయపాటి శ్రీను దర్శకత్వం చేశాడని అనుకోరు. మా కుటుంబ సభ్యుడు డైరెక్షన్‌ చేశాడని చెప్పుకుంటారు. మీరు నన్నెప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’’ అని బోయపాటి శ్రీను అన్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని