Ram: పోలీస్‌ వారియర్‌

రామ్‌ పోతినేని కథానాయకుడిగా తెర  కెక్కుతున్న ‘ది వారియర్‌’ విడుదల  ఖరారైంది. జులై 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆదివారం  ప్రకటించాయి సినీ వర్గాలు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామ్‌కి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది.  

Updated : 28 Mar 2022 09:47 IST

రామ్‌ పోతినేని కథానాయకుడిగా తెర  కెక్కుతున్న ‘ది వారియర్‌’ విడుదల  ఖరారైంది. జులై 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆదివారం  ప్రకటించాయి సినీ వర్గాలు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామ్‌కి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది.  ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని రెండు భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రామ్‌ ఇందులో పోలీస్‌ పాత్ర చేస్తున్నారు. ఆయన కెరీర్‌లో తొలిసారి ఖాకీ ధరించింది ఈ చిత్రం కోసమే. ప్రస్తుతం విజయ్‌ నేతృత్వంలో... రైల్వేస్టేషన్‌ నేపథ్యంలో వచ్చే విరామ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత   మాట్లాడుతూ ‘‘బలమైన కథతోపాటు, వాణిజ్య విలువలున్న చిత్రమిది. భావోద్వేగాలు, ఉన్నతమైన సాంకేతిక హంగులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హీరోని ఢీ కొట్టే పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. అక్షర గౌడ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. రామ్‌ కెరీర్‌లోనే అతి పెద్ద విజయం సాధించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ జులై నెలలోనే విడుదలైంది. భారీ   అంచనాలున్న ఈ సినిమా, మరో  ఊర మాస్‌ చిత్రంగా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంద’’న్నారు. ఈ చిత్రానికి  సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కూర్పు: నవీన్‌ నూలి, కళ: డి.వై.సత్యనారాయణ, పోరాటాలు: విజయ్‌, అన్భు - అరివు, ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌, మాటలు: సాయి మాధవ్‌ బుర్రా - లింగుస్వామి, సమర్పణ: పవన్‌   కుమార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని