Updated : 02 Jul 2022 07:23 IST

The Warriorr: సత్య వర్సెస్ గురు

ఒంటిమీద యూనిఫామ్‌ లేకపోయినా 24 గంటలూ డ్యూటీలోనే ఉంటానంటాడు. ఉదయం వార్నింగ్‌ ఇచ్చేసి... సాయంత్రంలోపే అరెస్ట్‌ చేసేస్తాడు. ఈ ఊరికి పట్టిన రోగం వేరు... ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్‌ వేరు అంటూ ఆపరేషన్‌ మొదలుపెట్టాడు. కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆ పోలీసు అధికారి కథేమిటో, ఆ ఊరి కోసం ఏం చేశాడో తెలియాలంటే ‘ది వారియర్‌’ (The Warriorr) చూడాల్సిందే. రామ్‌ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కృతిశెట్టి (Krithi Shetty) కథానాయిక. ఆది పినిశెట్టి (Aadhi) ప్రతినాయకుడిగా నటించారు. లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని శుక్రవారం అనంతపురంలో జరిగిన వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) విడుదల చేశారు. ట్రైలర్‌ యాక్షన్‌ ఘట్టాలతోనూ, శక్తివంతమైన సంభాషణలతోనూ ఆసక్తిని రేకెత్తించింది. సినిమాలో సత్య ఐపీఎస్‌గా రామ్‌ నటించగా, గురు అనే ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి నటించారు. సత్య, గురుల మధ్య వైరం నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతున్నట్టు స్పష్టమవుతోంది.

‘ది వారియర్‌ 2’ తీస్తా

‘‘తెలుగు ప్రేక్షకుల ఉత్సాహాన్ని.. ప్రేమని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నేరుగా తెలుగు సినిమా చేయాలనుకున్నా. అది ఈ సినిమాతో కుదరడం ఆనందంగా ఉంది. ఈ సంస్థలోనే మరో సినిమా చేయనున్నా. ‘ది వారియర్‌ 2’ చేస్తా’’ అన్నారు లింగుస్వామి (Lingusamy). రామ్‌ పోతినేని(Ram) మాట్లాడుతూ ‘‘తెలుగులో వచ్చిన చాలా కమర్షియల్‌ సినిమాలకి లింగుస్వామి చిత్రాల్లోని సన్నివేశాలు స్ఫూర్తి. శివ కార్తికేయన్‌ తమిళ ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘అనంతపురం ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. నాడు నందమూరి తారక రామారావు, నేడు బాలకృష్ణ వరకు ఇక్కడి ప్రజల మధ్య ఉండటానికే ఇష్టపడ్డారు. అంత మంచి మనుషులు. ‘ది వారియర్‌’ వేడుక ఇక్కడ జరగడంతోనే సగం విజయం సాధించిందని చిత్రబృందానికి చెప్పా’’ అన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని