Ramarao On Duty: అభిమానులకు రవితేజ టీజర్‌ సర్‌ప్రైజ్‌

మహా శివరాత్రి సందర్భంగా తన అభిమానులు, సినీ ప్రియులకు ఓ కానుక అందించారు నటుడు రవితేజ.

Updated : 01 Mar 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహా శివరాత్రి సందర్భంగా తన అభిమానులు, సినీ ప్రియులకు ఓ కానుక అందించారు నటుడు రవితేజ(Ravi teja). ఆయన హీరోగా నటిస్తున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’(Ramarao On Duty) చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘‘ఆయుధం మీద ఆధారపడే నీలాంటివాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బతికే నాలాంటివాడి ధైర్యం అణువణునా ఉంటుంది’’ అని రవితేజ చెప్పిన సంభాషణ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారు. ఆయన సరసన దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ సందడి చేయనున్నారు. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: శామ్‌ సీఎస్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌, కూర్పు: ప్రవీణ్‌ కేఎల్‌, కళ: సాహి సురేష్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు