Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
ప్రముఖ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) త్వరలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) త్వరలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు. ‘రంగమార్తాండ’ ప్రారంభానికి ముందు ‘ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని తెలిపారు. ‘‘నేను మాతృక చిత్రం ‘నట్‌సామ్రాట్’ (మరాఠీ)ని చూశా. ఇలాంటి సీరియస్ సినిమాని ఎవరుచూస్తారని అడిగా. ఆయన వినిపించుకోకుండా చిత్రీకరణ ప్రారంభించారు. ఇందులోని ఓ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపికకాకపోవడంతో ‘నేను చేస్తా’ అని చెప్పా. కళ్లతోనే నటించాలన్నారు. ఎమోషనల్ చిత్రాలను నేను చూడను’’ అని అన్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణతోపాటు ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి
-
Kishan Reddy: గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్‌రెడ్డి
-
UPI: పండుగ షాపింగ్.. యూపీఐ పేమెంట్స్‌కే జై