Rambo: ‘ర్యాంబో’ కథేంటి?

ఆశిష్‌ గాంధి హీరోగా రత్నాకరం అనిల్‌రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ర్యాంబో’. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. మలయాళంలో విజయవంతమైన ‘ఉడుంబ’కు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది.

Updated : 20 Mar 2022 09:23 IST

శిష్‌ గాంధి హీరోగా రత్నాకరం అనిల్‌రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ర్యాంబో’. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. మలయాళంలో విజయవంతమైన ‘ఉడుంబ’కు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశాం. మార్చి 28 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామ’’ని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని