RamCharan: డేట్‌కి వెళ్లిన చెర్రీ- ఉపాసన

దంపతులైన రామ్‌ చరణ్‌, ఉపాసన ఇప్పుడు డేటింగ్‌ వెళ్లడమేంటి? ఇదే కదా మీ సందేహం. మరేం లేదండి.. తమ తమ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ జంట వాటికి కాస్త విరామం ఇచ్చి సరదాగా గడపాలనుకున్నారేమో!

Updated : 08 Jul 2021 06:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఇప్పుడు డేట్‌కి వెళ్లడమేంటి? ఇదే కదా మీ సందేహం. మరేం లేదండి.. తమ తమ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ జంట వాటికి కాస్త విరామం ఇచ్చి సరదాగా గడపాలనుకున్నారేమో! అందుకే వీకెండ్‌ కాకపోయినా ‘మిడ్‌ వీక్‌’ అంటూ బుధవారం ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ నోరూరించే వంటకాల్ని ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. ఆ రెస్టారెంట్‌లో దిగిన ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు ఉపాసన. ఇద్దరూ ఓ టేబుల్‌ దగ్గర కూర్చుని చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. వైట్‌ షర్ట్‌లో చెర్రీ, రెడ్‌ డ్రెస్‌లో ఉపాసన లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకి ‘లంచ్‌ బ్రేక్‌.. లంచ్‌ డేట్‌’ అనే వ్యాఖ్యని జతచేశారు ఉపాసన. అది ఎక్కడనేది మాత్రం చెప్పలేదు. ఇదీ సంగతి.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా దర్శనమివ్వనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో కథానాయకుడు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తయ్యాక తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్‌తో ఓ చిత్రం చేయనున్నారు చరణ్‌.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని