Ramcharan: చరణ్‌ మామ.. వీడియో సూపరూ..!

తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్‌’ విడుదలపై రామ్‌ చరణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘భీమ్లానాయక్‌’ టీమ్‌కి అభినందనలు తెలుపుతూ...

Published : 24 Feb 2022 12:37 IST

స్పెషల్‌ వీడియో అదుర్స్‌ అంటోన్న మెగా పవర్‌ ఫ్యాన్స్‌

హైదరాబాద్‌: తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్‌’ విడుదలకానున్న తరుణంలో రామ్‌ చరణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘భీమ్లానాయక్‌’ టీమ్‌కి అభినందనలు తెలుపుతూ ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. అహంకారం, ఆత్మభిమానం మధ్య పోరు అనే ఆసక్తికర అంశంతో తెరకెక్కిన ‘భీమ్లానాయక్‌’ సినిమా షూట్‌ గత కొన్నిరోజుల ముందు వరకూ నిర్విరామంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. అదే సమయంలో ‘భీమ్లానాయక్‌’ షూట్‌ జరిగిన లొకేషన్స్‌లోనే మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రీకరణ కూడా కొన్నిరోజులపాటు జరిగింది. అలా, చిరు.. పవన్‌ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చిత్రబృందంతో కాసేపు సరదాగా మాట్లాడి ఫొటోలు దిగారు.

అనంతరం కొన్నిరోజులకు ‘గాడ్‌ఫాదర్‌’ షూట్‌ జరిగిన లొకేషన్స్‌లో ‘భీమ్లానాయక్‌’ షూట్‌ కూడా జరగడంతో.. ఈసారి పవన్‌.. తన అన్నయ్య సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు. అదే సమయంలో అక్కడ ఉన్న నటుడు ఆర్‌.నారాయణమూర్తి, మాటల రచయిత విజయేంద్రప్రసాద్‌తోపాటు ఇతర చిత్రబృందంతో కొద్దిసేపు మాట్లాడారు. కాగా, తాజాగా ‘భీమ్లానాయక్‌’ విడుదలకు అభినందనలు తెలుపుతూ చరణ్‌ ఈ స్పెషల్‌ వీడియో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చూసి మెగా పవర్‌ అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ‘చరణ్‌ మామ.. నువ్వు సూపర్‌.. భలే వీడియో షేర్‌ చేశావ్‌’, ‘అన్నదమ్ములిద్దర్నీ ఒకే ఫ్రేమ్‌లో ఇలా చూస్తుంటే పండుగలా ఉంది’ అంటూ తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో బయటపెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని