RGV: ఆర్జీవీకి పేర్ని నాని ఆహ్వానం.. భేటీ ఆరోజే

సినిమా టికెట్‌ ధరల విషయం చర్చించేందుకు తనను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆహ్వానించారని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.

Published : 07 Jan 2022 21:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా టికెట్‌ ధరల విషయం చర్చించేందుకు తనను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆహ్వానించారని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్‌ ధరల విషయం గురించి మాట్లాడేందుకు పేర్ని నానిగారు నన్ను ఆహ్వానించారని తెలియజేసేందుకు ఆనందంగా ఉంది. అమరావతి సచివాలయంలో జనవరి 10న మధ్యాహ్నం భేటీ అవుతున్నాం’’ అని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు.

సినిమా టికెట్‌ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన యూట్యూబ్‌ ఛానల్‌, సోషల్‌ మీడియా వేదికగా ఆ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాని ట్విటర్‌లో స్పందించారు. అలా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. చివరగా.. ప్రభుత్వంతో గొడవపడాలనేది తన ఉద్దేశం కాదని, అనుమతిస్తే కలుస్తానని ఆర్జీవీ.. నానిని కోరారు. ‘త్వరలోనే కలుద్దాం’ అని నాని ఇటీవల రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో తనకు పేర్ని నాని నుంచి పిలుపు వచ్చిందని ఆర్జీవీ ట్వీట్‌ పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని