RGV: కేజీయఫ్‌-2 వాళ్లకి హారర్‌ చిత్రం: వర్మ

రూ.134.5 కోట్ల భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘కేజీయఫ్‌-2’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఈ మోస్ట్‌...

Published : 16 Apr 2022 10:58 IST

బాలీవుడ్‌పై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్‌: రూ.134.5 కోట్ల భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘కేజీయఫ్‌-2’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘కేజీయఫ్‌-2’ సక్సెస్‌ని ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ బాలీవుడ్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘కేజీయఫ్-2‌’ బాలీవుడ్‌ వాళ్లకి హార్‌ర్‌ సినిమాతో సమానమని.. ఈ సినిమా విజయంతో రానున్న రోజుల్లో అక్కడి వాళ్లకు పీడ కలలు రాక తప్పదని ఆయన అన్నారు. ఈ మేరకు వర్మ తాజాగా వరుస ట్వీట్లు చేశారు.

‘‘నటీనటుల పారితోషికానికి కాకుండా సినిమా తెరకెక్కించడంలో భారీగా ఖర్చు పెడితే తప్పకుండా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ సొంతం చేసుకోవచ్చని ‘కేజీయఫ్‌-2’ విజయం నిరూపించింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ పరిశ్రమలను పక్కనపెడితే ‘కేజీయఫ్‌’ ముందు వరకూ కన్నడ చిత్రపరిశ్రమను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ‘కేజీయఫ్‌-2’తో ప్రశాంత్‌నీల్‌ కన్నడ చిత్రపరిశ్రమకు ప్రపంచఖ్యాతి దక్కేలా చేశాడు. విలన్స్‌తో పోరాడేందుకు మిషన్‌గన్‌తో రాఖీబాయ్‌ ఎలా అయితే ముంబయిలోకి అడుగుపెట్టాడో.. అదేమాదిరిగా ఓపెనింగ్‌ కలెక్షన్స్‌తో బాలీవుడ్‌ స్టార్స్‌ అందరిపై యశ్‌ యుద్ధం చేశాడు. ఇక, ఈ సినిమా ఫైనల్‌ కలెక్షన్స్‌తో బాలీవుడ్‌పై శాండిల్‌వుడ్‌ నూక్లియర్‌ బాంబ్‌ విసరనుంది. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌-2’ గ్యాంగ్‌స్టర్‌ చిత్రం మాత్రమే కాదు.. బాలీవుడ్‌వాళ్లకి అదొక హారర్‌ సినిమా. ఈ సినిమా విజయంతో వాళ్లకి తప్పక పీడకలలు వస్తాయి’’ అని వర్మ స్ట్రాంగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్‌ నుంచి వరుస సినిమాలు వస్తున్నప్పటికీ.. సరైన బ్లాక్‌బస్టర్‌, భారీ వసూళ్లు రాబట్టే సినిమా రాలేదని నెటిజన్లు, సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వర్మ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు