RGV: ముందు విభజనలు మానేసి.. మంచి చిత్రాలు తీయండి: ఆర్జీవీ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏ విషయం గురించైనా సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తన అభిప్రాయాన్ని తెలియచేయడమైనా ఇతరుల అభిప్రాయలను వ్యతిరేకించడమైనా ఇలా ఏది చేయాలన్నా సోషల్‌ మీడియానే వేదికగా చేసుకుంటారు.

Published : 30 Apr 2022 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి అంశంపైనా తనదైన శైలిలో స్పందిస్తారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ప్రస్తుతం దక్షిణాది, ఉత్తరాది చిత్రాల విషయమై నటీనటుల మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వర్మ వరుస ట్వీట్లు చేశారు. ‘‘కేజీయఫ్‌ 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లు కేవలం హిందీలో మాత్రమే కాదు తమిళ్‌, మలయాళ భాషల్లోనూ డబ్‌ చేశారు. ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్‌ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు సినిమాకి ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ కావాలంటే అన్ని భాషల్లో విడుదల చేస్తారు. ఒకప్పటి హిందీ చిత్రాలు ‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’ నుంచి తాజాగా ‘దంగల్‌’ వరకు ఎన్నో హిందీ చిత్రాలను ఇతర భాషల్లో డబ్‌ చేశారు. కానీ అవి ప్రాంతీయంగా రాబట్టిన కలెకన్లు ఇతర భాషల్లో సాధించలేక పోయాయి’’

‘‘ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు ఇటీవల బాలీవుడ్‌లోనూ హిట్‌ అవుతున్నాయి. అంటే ప్రజలు సినిమాలోని కంటెంట్‌ను మాత్రమే చూస్తారు తప్ప అది ఏ భాష సినిమా అనేది చూడరన్న విషయం మరోసారి రుజువైంది. ఇలా బాలీవుడ్‌, టాలీవుడ్‌ అని విభజించడం మానేసి కథానాయకులు, దర్శకులు ఇతర భాషల వారితో ఆరోగ్యవంతమైన పోటీతత్వాన్ని పెంచుకుంటే ప్రేక్షకులు అన్నిరకాల చిత్రాలను అందించవచ్చు. ఎవరు బెస్ట్‌, ఏది బెస్ట్‌ అన్న విషయాన్ని అప్పుడు వాళ్లే నిర్ణయిస్తారు’’

‘‘ప్రభాస్‌, యశ్‌, రామ్‌చరణ్‌, తారక్‌, అల్లు అర్జున్‌లు బాలీవుడ్‌లో నటించినా వీళ్ల సినిమాలు బ్లాక్‌బాస్టర్స్‌ అవుతాయి. ఇది కాదనలేని వాస్తవం. అలాగే హిందీ సూపర్‌ స్టార్‌ రణ్‌వీర్‌సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌ దేవగణ్‌, జాన్‌ అబ్రహాంలు టాలీవుడ్‌లో సినిమాలు చేసి బాలీవుడ్‌లో వసూలు చేసినంత కలెక్షన్‌లు సాధించగలరా? ఇది మీకు ఛాలెంజ్‌’ అంటూ వర్మ వరుస ట్వీట్‌లు చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని