సుమకు విశేష.. సోనూకు ప్రత్యేక పురస్కారం

ప్రతిష్టాత్మకంగా అందించే డా. రామినేని ఫౌండేషన్‌- 2020 అవార్డులను ప్రకటించారు. సంస్థ ఛైర్మన్‌ రామినేని ధర్మచక్ర, కన్వీనర్‌ పాతూరి నాగభూషణం శనివారం ఈ పురస్కారాలను ప్రకటించారు. నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులుకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు, సంఘ సేవకుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం....

Published : 01 Nov 2020 01:27 IST

రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా అందించే డా. రామినేని ఫౌండేషన్‌- 2020 అవార్డులను ప్రకటించారు. సంస్థ ఛైర్మన్‌ రామినేని ధర్మచక్ర, కన్వీనర్‌ పాతూరి నాగభూషణం శనివారం ఈ పురస్కారాలను వెల్లడించారు. నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులుకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు, సంఘ సేవకుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం, ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల, బ్యాడ్మింటన్‌ అంపైర్‌ వేమూరి సుధాకర్‌, సంఘ సేవకుడు బండ్లమూడి శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలో అవార్డుల ప్రదాన తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

1999లో రామినేని ఫౌండేషన్‌ను ఆరంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది 2007 వరకు అవార్డులు అందజేశారు. మళ్లీ 2018లో ప్రముఖ ఉపన్యాసకుడు, రచయిత గరికపాటి నరసింహారావుకు విశేష పురస్కారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని