Published : 13/01/2022 23:11 IST

Hero: ‘హీరో’ టైటిల్‌ లభించటం, సంక్రాంతికి విడుదలవడంఅదృష్టమే: రానా

హైదరాబాద్‌: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, నటుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్‌ కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. నటులు రానా, సుధీర్‌బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి ఎవరైనా నటుడిగా అడుగేస్తుంటే విమర్శలు ఎదురవుతాయి. ‘ఇతడిని కూడా మనం చూడాలా?’ అని చాలామంది అనుకుంటుంటారు. ఆ నటుడు కష్టపడకుండా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు అలా అనుకోవటంలో తప్పులేదు. అశోక్‌ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తను విజయం అందుకుంటాడనే నమ్మకం నాకుంది. ఒకవేళ నా పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే అశోక్‌నే ఫాలో అవ్వమని వారికి సూచిస్తా. దర్శకుడు శ్రీరామ్‌కి మంచి అభిరుచి ఉంది. గతంలో ఆయనతో కలిసి ‘భలే మంచిరోజు’ అనే సినిమా చేశా’’ అని అన్నారు. ‘‘అశోక్‌కి చాలా అదృష్టం ఉందని చెప్పొచ్చు. హీరో అనే టైటిల్‌, దానితోపాటు స్టార్‌లోగో లభించటం, సినిమా సంక్రాంతికి విడుదలవడం మామూలు విషయం కాదు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని రానా అన్నారు.








Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని