Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
అభిరామ్ దగ్గుబాటి (Abhiram Daggubati), గీతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అహింస’ (Ahimsa). జూన్ 2న ఇది విడుదల కానుంది.
హైదరాబాద్: ‘అహింస’ (Ahimsa)తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు రానా (Rana) తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి (Abhiram Daggubati). ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు దర్శకుడు తేజ (Teja) తనని అందరి ముందు తిట్టారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిరామ్ చెప్పారు. ఓ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తనకు దెబ్బలు తగిలాయని, ఆరు నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని తెలిపారు.
‘‘ఓసారి తేజ నాన్నను కలిసి ఈ కథ చెప్పారు. నన్ను హీరోగా లాంఛ్ చేయడానికి ఈ కథ సరిగ్గా సరిపోతుందని నాన్న అనుకున్నారు. అలా, ఈ సినిమాలో నేను హీరో అయ్యాను. సినిమా షూట్ చేస్తున్నప్పుడు తేజ.. నన్ను అందరి ముందు మైక్‌లో తిట్టారు. ‘నీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా నాకు సంబంధం లేదు. ఆడియన్స్ కోసమే నేను ఈ సినిమా చేస్తున్నా. కాబట్టి ఫోకస్ పెట్టి నటించు’ అని కేకలు వేశారు. హీరోయిన్‌ను ఎత్తుకుని పరిగెత్తే ఓ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు నేను కిందపడిపోయాను. మోకాళ్లకు దెబ్బలు తగిలాయి. దాదాపు ఆరు నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకున్నా. సినిమా పూర్తయ్యాక ఇంట్లోవాళ్లకు సినిమా చూపించాం. బాబాయ్, అన్నయ్య చిన్న చిన్న సలహాలు ఇచ్చారు. విడుదల తేదీ దగ్గరకు వచ్చేకొద్ది కంగారుగా అనిపిస్తుంది. ఆ భయంతో రాత్రి పూట నిద్ర కూడా పట్టడం లేదు’’ అని పేర్కొన్నారు. మరో ఇంటర్వ్యూలో.. ‘‘మిమ్మల్ని ఎన్నో విషయాలు అడగాలని మీడియా వాళ్లందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్లను ఎలా ఫేస్ చేస్తున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘విషయం ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం సినిమాపైనే ఉంది’’ అని ఆయన బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TATA Sons IPO: అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ