Rana-Teja: ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో రిపీట్
నటుడు రానా (Rana) - దర్శకుడు తేజ (Teja) కాంబోలో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది.
హైదరాబాద్: ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri)తో హిట్ అందుకుని క్రేజీ కాంబోగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు నటుడు రానా (Rana) - దర్శకుడు తేజ (Teja). దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కనుంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానున్న ఈ చిత్రానికి గోపీనాథ్ ఆచంట నిర్మాతగా వ్యవహరించనున్నారు. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్‌హీరో ఇందులో కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే, ఈ సినిమాలో రానా పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. త్వరలోనే ఇది పట్టాలెక్కనుందని చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
రానా సోదరుడు అభిరామ్ హీరోగా తేజ ఇటీవల ‘అహింస’ చిత్రాన్ని తెరకెక్కించారు. విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, రానా ఇటీవల ‘రానా నాయుడు’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించారు. త్వరలోనే ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘రానా నాయుడు -2’ రూపుదిద్దుకోనుంది. ‘అహింస’ సినిమా రిలీజ్ అయ్యాక రానా - తేజ కాంబోలో సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్
-
‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్
-
Guntur: సోషల్ మీడియా పోస్టింగ్ కేసు.. వరప్రసాద్‌కు బెయిల్