వైభవంగా రానా- మిహీకా వివాహం

సినీ నటుడు రానా దగ్గుబాటి వివాహం ఘనంగా జరిగింది. వధువు మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు,

Updated : 09 Aug 2020 15:22 IST

హైదరాబాద్‌: సినీ నటుడు రానా దగ్గుబాటి వివాహం వైభవంగా జరిగింది. వధువు మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు, కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయటపెట్టాడు. మిహీకా బజాజ్‌ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి అంగీకరించాయి. దీంతో శనివారం రాత్రి 8.30 గంటలకు సుమూహుర్త సమయంలో రానా-మిహీకా ఒక్కటయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని