Rana Daggubati: రానా లగేజ్‌ మిస్‌.. విమాన సిబ్బంది తీరుపై నటుడి అసహనం

ఒక ప్రైవేటు ఎయిర్‌లైన్‌పై టాలీవుడ్‌ నటుడు రానా అసహనం వ్యక్తం చేశారు. అదొక చేదు అనుభవం అని అన్నారు.

Updated : 04 Dec 2022 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:ఒక ప్రైవేటు విమానయాన సంస్థ సిబ్బంది తీరుపై నటుడు రానా (Rana Daggubati) అసహనం వ్యక్తం చేశారు. తన లగేజ్‌ మిస్ అయిందని, స్టాఫ్‌ దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇలాంటి చెత్త అనుభవం తనకెప్పుడూ ఎదురవలేదన్న రానా..  ఆ సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు. తాము కల్పించే సదుపాయాలు, రక్షణ గురించి ఇటీవల ఆ సంస్థ ట్వీట్‌ చేయగా.. రానా వాటిని రీ ట్వీట్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఈ ఫ్లైట్స్‌ అనుకున్న సమయానికి టేకాఫ్‌కాకపోవచ్చు, ల్యాండ్‌కాకపోవచ్చు. మీ సామాను గురించి వారికి ఎలాంటి ఆధారాలు దొరకవు’ అని  వింటర్‌ సేల్‌ ఆఫర్‌ పోస్ట్‌పై రానా కామెంట్‌ చేశారు. దీనిపై పలువులు నెటిజన్లు, అభిమానులు స్పందించారు. గతంలో తమకు ఎదురైన అనుభవాలను కామెంట్ల రూపంలో రానాతో పంచుకుంటున్నారు. అయితే ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు.

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విమానాశ్రయానికి చేరుకొని చెక్ ఇన్ ఇయ్యాక  బెంగళూరు సర్వీసు ఆలస్యమవుతుందని, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. లగేజ్ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. బెంగళూరు చేరుకున్నాక లగేజ్ రాకపోవడంతో రానా విమానాశ్రయ సిబ్బందిని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అక్కడున్న  ఉన్నతాధికారులను నిలదీశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని