Rana: సమంతతో మాట్లాడుతుంటా: రానా
సుమారు రెండేళ్ల క్రితం నటుడు నాగచైతన్య (Naga Chaitanya), నటి సమంత (Samantha) వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే చాలా రోజుల తర్వాత సమంత గురించి చైతన్య బావ, నటుడు రానా స్పందించారు.
హైదరాబాద్: వీలు కుదిరినప్పుడల్లా నటి సమంత(Samantha)తో తాను మాట్లాడుతుంటానని నటుడు దగ్గుబాటి రానా (Rana) అన్నారు. సామ్ మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిన తర్వాత.. ఆమెకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు చెప్పారు. తన సరికొత్త వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఇటీవల కాలంలో పలువురు నటీనటులు తమ అనారోగ్య సమస్యల గురించి వెల్లడించడంపై స్పందించారు.
‘‘నటీనటులు తమకున్న సమస్యల గురించి బయట ప్రపంచానికి చెప్పాలా? లేదా? అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత విషయం. ప్రతిఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఈ భూమ్మీద ఏ ఒక్కరి జీవితం పూల పాన్పులా ఉండదు. ప్రతి ఒక్కరికీ జీవితాన్ని మార్చేది ఒకటి ఉంటుంది. అలాగే, జీవితాన్ని ఇబ్బందిపెట్టేదీ ఒకటి ఉంటుంది. విషయం ఏదైనా దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొన్నావనేది ఎంతో ముఖ్యం. సమస్యలు వచ్చినప్పటికీ.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగిపోవడంలోనే అందం ఉంది’’ అని ఆయన వివరించారు.
యాక్షన్, క్రైమ్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా దీన్ని తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం రానా తొలిసారి ఆయన బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి నటించారు. అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం