Project K: ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి’ రికార్డులు ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్ చేస్తుంది: రానా
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ - కె’ (Project K)పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపాయి.
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కిస్తోన్న సినిమా ‘ప్రాజెక్ట్ - కె’ (Project K)’. భారీ తారాగణంతో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ ప్రియులు ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్‌మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు నటుడు రానా (Rana Daggubati). దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానా ‘ప్రాజెక్ట్-కె’ గురించి మాట్లాడారు. ‘‘మరికొన్ని రోజుల్లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కచ్చింతంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న ‘బాహుబలి’ (Baahubali), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) రికార్డులను బ్రేక్ చేస్తుంది. నేనూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆతృతగా ఉన్నాను. ఈ తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని నేను నమ్మకంగా ఉన్నాను. టాలీవుడ్‌లో ఒక హీరో సినిమాను మరొక హీరో సపోర్ట్ చేస్తూ సెలబ్రెట్ చేసుకుంటుంటారు. ఇది చాలా గొప్ప విషయం. ఇక భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది’’ అని రానా అన్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఇప్పటికే అమితాబ్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మల్టీటాలెంటెడ్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vande Bharat Sleeper: వందే భారత్‌లో స్లీపర్ కోచ్‌లు.. ఫొటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి
-
Anushka Sharma: అనుష్క శర్మ రెండోసారి తల్లి కానుందంటూ వార్తలు.. నటి ఇన్‌స్టా స్టోరీ వైరల్..!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India-Canada: భారత్‌తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తాం: కెనడా
-
Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు