Rana Daggubati: రానా నటించిన ‘1945’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే...

దగ్గుబాటి రానా, రెజీనా హీరోహీరోయిన్లుగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్‌ డ్రామా చిత్రం ‘1945’  రెజీనా కథానాయిక. సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ‘సన్‌నెక్ట్స్‌’లో ఫిబ్రవరి7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 05 Feb 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దగ్గుబాటి రానా, రెజీనా హీరోహీరోయిన్లుగా సత్యశివ తెరకెక్కించిన పీరియాడిక్‌ డ్రామా చిత్రం ‘1945’  సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ‘సన్‌నెక్ట్స్‌’లో ఫిబ్రవరి7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సుమారు ఆరేళ్ల క్రితమే ఈ చిత్రం విడుదల కావాల్సి ప్రారంభమైనా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.  సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు. సత్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు.  బ్రిటిష్ పాలన నేపథ్యంలో 1945 సినిమాను తెరకెక్కించిన సినిమా దాదాపు 90 శాతం పూర్తి అయ్యాక సినిమా దర్శకుడు స‌త్యశివతో రానాకి విభేదాలు ఏర్పడ్డాయి. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి రానా తప్పుకున్నాడు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది. క్లైమాక్స్‌ చిత్రీకరణ జరగలేదు. 1945 క్లైమాక్స్‌ సరిగ్గా లేకుండానే థియేటర్లలో విడుదల కావడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్‌ వద్దా పెద్దగా కాసుల వర్షం కురిపించలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని