Rana: దుల్కర్ సల్మాన్ హీరోగా రానా దగ్గుబాటి సినిమా..!
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాను రానా నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
హైదరాబాద్: ‘మహానటి’తో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకొని ‘సీతారామం’తో అందరి అభిమాన హీరోగా మారారు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇప్పుడీ హీరో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దుల్కర్ ఒక కొత్త కాన్సెప్ట్‌తో పలకరించనున్నాడు. అయితే ఆ చిత్రానికి రానా (Rana Daggubati) నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం.
రానా దగ్గుబాటికి స్పిరిట్ మీడియా అనే బ్యానర్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్‌పైనే దుల్కర్ సినిమాను నిర్మించనున్నారట రానా. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. అంతే కాదు ఇందులో దర్శకుడు సముద్రఖని కీలకపాత్రలో నటించనున్నారట. ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరెకెక్కనుంది. జూన్ 6న రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా రానా ఈ విషయాన్ని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారట. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరోజు చెప్పనున్నారట. ఇక ప్రస్తుతం దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమాతో (King of Kotha) బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత దుల్కర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశారు. ఆ సినిమానే రానా నిర్మించనున్నారని టాక్. ఇక రానా స్పిరిట్ బ్యానర్‌పై రూపొందిన ‘పరేషాన్’ సినిమా జూన్2న విడుదల కానుంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తాను రానా మంచి స్నేహితులమని చెప్పిన విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచే వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అని దుల్కర్ చెప్పారు. నాగ చైతన్య (Naga Chaitanya) చెన్నైలో చదువుకునే రోజుల్లో వీరంతా కలిసి ఉండేవారని అప్పటి నుంచి వాళ్ల స్నేహం కొనసాగుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు