Rana Miheeka: తండ్రి కానున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

రానా దంపతులు తల్లిదండ్రులు కానున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిపై రానా స్పందించారు. 

Published : 22 Nov 2022 15:03 IST

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా రానా(Rana) దంపతులు తల్లిదండ్రులు కానున్నారనే వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇటీవల రానా భార్య మిహీక(Miheeka) తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఆ ఫొటోల్లో ఆమె కొంచెం బొద్దుగా కనిపించే సరికి అభిమానులు అంతా ఆమె ప్రెగ్నెంట్‌ అని అనుకున్నారు. ‘త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నారా..’  అంటూ కామెంట్లు పెట్టారు. వీటిపై రానా దంపతుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ వార్త జోరుగా ప్రచారమైంది. సోషల్‌ మీడియా వేదికగా అందరూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. గాయని కనికా కపూర్‌(Kanika Kapoor) కూడా శుభాకాంక్షలు తెలపడంతో రానా స్పందించారు.

తాను తండ్రిని కానున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇదంతా రూమర్ అని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వదంతులు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని అన్నారు. రానా ఇచ్చిన రిప్లైతో ఈ వార్తలకు చెక్‌ పడినట్లు అయ్యింది. గతంలోనూ ఈ జంటపై ఇలాంటి రూమర్సే వచ్చాయి. అప్పుడు మిహీక స్పందించి ఓ అభిమానికి ‘అలా ఏం కాదంటూ’ సమాధానం చెప్పింది. కాగా  రానా, మిహీక 2020 ఆగస్టు 8న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని