Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!

నటుడు రానా (Rana) తన చిన్నప్పటి ఇంటిని పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ నివాసంలో ప్రస్తుతం ఓ ఫేమస్‌ రెస్టారెంట్‌ నడుపుతున్నట్లు ఆయన చెప్పారు.

Published : 02 Apr 2023 15:26 IST

హైదరాబాద్‌: నటుడు వెంకటేశ్‌ (Venkatesh) కుమార్తె ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీని వేదికగా పలు రకాలైన ఫుడ్స్‌ను ఇప్పటివరకూ పరిచయం చేసిన ఆమె తాజాగా తన అన్నయ్య, నటుడు రానా (Rana)తో కలిసి పిజ్జాలు తయారు చేశారు. ఇందులో భాగంగా వీరిద్దరూ తమ చిన్నప్పటి ఇంటిని నెటిజన్లకు పరిచయం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ నివాసంలో ప్రస్తుతం శాంచరీ (Sanctuary) రెస్టారెంట్‌ నడుపుతున్నట్లు రానా తెలిపారు. తన స్నేహితుడు గోకుల్‌ దీనిని సిద్ధం చేశారని అన్నారు. ఎపిసోడ్‌లో భాగంగా ఆశ్రితతో కలిసి ఆ రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ ఇంట్లో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నట్లు చెప్పారు. అనంతరం సోదరితో కలిసి పిజ్జాలు తయారు చేశారు. మాంసం, చీజ్‌ ఎక్కువగా ఉన్న పిజ్జా తినడమంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ‘రానా నాయుడు’ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘బాబాయ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి మొదట ఎంతో కంగారుపడ్డాను. ఎందుకంటే, ఇలాంటి షోలు, సినిమాలు నేను చేస్తుంటాను. బాబాయ్‌ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు కదా. మొదట కాస్త భయంగా అనిపించినా.. సెట్స్‌లోకి వెళ్లేసరికి ఉత్సాహంగా వర్క్‌ చేశాం. ఆయనతో కలిసి వర్క్‌ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. కాస్త విభిన్నంగా ఏదైనా చేయాలనుకున్నా. అలాగే, బాబాయ్‌ కూడా తనని తాను పునరావిష్కృతం చేసుకున్నారు. ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించారు. మేమిద్దరం కలిసి అలాంటి రోల్స్‌ చేయడం స్పెషల్‌గా అనిపించింది. సెట్స్‌లో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సిరీస్‌  చూసిన తర్వాత ఇంట్లో వాళ్ల నుంచి విచిత్రమైన రియాక్షన్స్‌ వస్తున్నాయి’’ అని రానా (Rana) పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని