Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలు విషయం ఏమిటంటే..!

‘రానా నాయుడు’ సిరీస్‌ ప్రమోషన్స్‌లో మృణాల్‌ ఠాకూర్‌ కూడా భాగమైంది. ఈ మేరకు ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

Published : 15 Mar 2023 17:21 IST

ముంబయి: తన ఈ-మెయిల్‌ ఖాతా హ్యాక్‌కు గురైందని.. గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).  తన వ్యక్తిగత సమాచారం, సినిమా స్క్రిప్ట్‌లన్నీ ఈ ఖాతాలో ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇదంతా నిజంగా జరగలేదు. కేవలం ఓ షో ప్రమోషన్ కోసం దీనిని షూట్‌ చేశారు. ఇంతకీ ఆ షో ఏమిటంటే..!

రానా(Rana), వెంకటేశ్‌ (Venkatesh) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో రానా.. సెలబ్రిటీల సమస్యలు తీర్చే వ్యక్తిగా కనిపిస్తారు. ఇప్పటికే ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో జాన్వీకపూర్‌ భాగమైన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా నటి మృణాల్‌ సైతం ‘రానానాయుడు’ ప్రమోషన్‌ కోసం రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు. తన మెయిల్‌ ఖాతా హ్యాక్‌కు గురైందని.. ఏం చేయాలో తెలియక రానా నాయుడుని సంప్రదించానని చెప్పింది. ఆయన సాయంతో సమస్య పరిష్కారమైనట్లు వెల్లడించింది. ‘రానా.. ఇలాంటి సమస్యల నుంచి ఎలా గట్టెక్కిస్తాడో తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న రానా నాయుడు చూసేయండి’ అని మృణాల్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని