Rana Naidu: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘రానానాయుడు’.. నోరుజారిన వెంకటేశ్‌

Rana Naidu: వెంకటేశ్‌, రానా కీలక పాత్రల్లో నటించిన ‘రానానాయుడు’ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ మొదలైంది.

Updated : 10 Mar 2023 16:32 IST

హైదరాబాద్‌: రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రానా నాయుడు. (Rana Naidu). అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనొవాన్‌’ను స్ఫూర్తిగా తీసుకుని భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దారు. శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ మొదలైంది. అయితే, చాలా ఆలస్యంగా మొదలవడం గమనార్హం. గురువారం అర్ధరాత్రి తర్వాత ‘రానానాయుడు’ స్ట్రీమింగ్‌కు వస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, శుక్రవారం మధ్యాహ్నం 2గంటల తర్వాత నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ మొదలైంది. మొత్తం పది ఎపిసోడ్‌లు ఉండగా, ఒక్కో ఎపిసోడ్‌ 45-50 నిమిషాల నిడివిని కలిగి ఉన్నాయి. హిందీ, తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, స్పానిష్‌ ఆడియోతో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌, హిందీ సబ్‌టైటిల్స్‌తో కూడా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇది రానా షో: వెంకటేశ్‌

అటు వెంకటేశ్‌, ఇటు రానా కలిసి నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ కావడంతో దీనిపై మంచి అంచనాల ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఈ సిరీస్‌ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ షోకు విచ్చేసి సిరీస్‌ను చూశారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడారు. ‘కష్టపడి పనిచేశాం. డార్క్‌ ఫ్యామిలీ డ్రామా. చాలా ఎమోషన్స్‌, హింస, సెక్స్‌ కూడా ఉంటుంది. (అయ్యో చెప్పేశానే)  నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌ చాలా నిజాయతీగా పనిచేసింది. మీరు ఒక్కొక్కరూ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఓపెన్‌ చేసి చూడటం మొదలు పెడితే మీ ఎక్స్‌ప్రెషన్స్‌ మారిపోతూ ఉంటాయి. (నవ్వులు) ఇందులో ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. ఇది రానా షో. అక్కడక్కడా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి’’ అని అన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ తనదైన హావభావాలతో నవ్వించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు