Rana Naidu: కొత్త వేదికపై సరి కొత్తగా

కథానాయకులు తాము పోషించే పాత్రలకి తగ్గట్టుగా అప్పుడప్పుడూ లుక్‌ మార్చడం సహజమే. అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఈసారి వెబ్‌ సిరీస్‌ కోసం మరో అడుగు ముందుకేశారు. తెల్ల జుత్తుతో ఇదివరకెప్పుడూ చూడని అవతారంలో సరికొత్తగా కనిపిస్తున్నారు.

Updated : 25 Sep 2022 07:21 IST

కథానాయకులు తాము పోషించే పాత్రలకి తగ్గట్టుగా అప్పుడప్పుడూ లుక్‌ మార్చడం సహజమే. అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ (Venkatesh) ఈసారి వెబ్‌ సిరీస్‌ కోసం మరో అడుగు ముందుకేశారు. తెల్ల జుత్తుతో ఇదివరకెప్పుడూ చూడని అవతారంలో సరికొత్తగా కనిపిస్తున్నారు. కొత్త వేదికపై కొత్త లుక్‌ అన్నమాట. ఇదంతా ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌ కోసమే. ముంబయి నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. శనివారం టీజర్‌ని విడుదల చేశారు. నిజ జీవితంలో బాబాయ్‌ అబ్బాయిలైన వెంకటేష్, రానా (Rana) తెరపై తండ్రి, తనయుల్ని పోలిన పాత్రల్లో ఢీ అంటే ఢీ అన్నట్టుగా కనిపించనున్నారు. ఈ సిరీస్‌కి కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు