Bheemla Nayak: పవన్ ప్రభావం చాలా ఉంది: రానా
ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ‘భీమ్లా నాయక్’ తర్వాత మరోలా ఉంటాయని నటుడు రానా అన్నారు.
హైదరాబాద్: ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ‘భీమ్లా నాయక్’ తర్వాత మరోలా ఉంటాయని నటుడు రానా అన్నారు. ఈ సినిమా తర్వాత పవన్ ప్రభావం తనపై చాలా ఉంటుందని చెప్పుకొచ్చారు. పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె.చంద్ర దర్శకుడు. బుధవారం జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మట్లాడారు. ‘‘ఈ సినిమాతో చాలా మంది మేధావులతో కలిశా. నేను నటుడినై 12 ఏళ్లు అయింది. కానీ, ఇప్పటి వరకూ హీరోను కాలేకపోయాను. నేను చాలా మంది సూపర్‌స్టార్‌తో చేశా. పవన్‌కల్యాణ్ వాళ్లందరికీ భిన్నం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే, కల్యాణ్‌గారి ప్రభావంతో మరొకలా ఉంటాయి. త్రివిక్రమ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు. సినిమాకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. భారతదేశానికి హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మారుస్తామని హామీ ఇస్తున్నాం’’ అని రానా అన్నారు.
‘భీమ్లానాయక్’కు వెన్నెముక త్రివిక్రమ్
దర్శకుడు సాగర్ కె.చంద్ర మాట్లాడుతూ.. ‘‘నల్గొండ నుంచి దర్శకుడు అవుదామని వచ్చా. నిజంగా ఇదొక అద్భుత ఘట్టం. పంజా ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. పాస్ ఉంటే వెళ్దామని ప్రయత్నిస్తే మూడుసార్లు తోసేశారు. ఇప్పుడు అదే పవన్‌కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించి ఇక్కడ మాట్లాడుతున్నా. నా చుట్టూ ఉన్న మంచి వాళ్ల వల్ల ఇది జరిగింది. రానా ఎప్పుడూ అదే ఎనర్జీతో పనిచేస్తారు. నేను మరొకరిలా బతకాలి అని అనుకుంటే అది రానాలాగే. ఈ సినిమాలో నటించి నటీనటులకు ధన్యవాదాలు. నాగవంశీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టుకు వెన్నెముక. ఆయన లేకపోతే ‘భీమ్లానాయక్’ లేదు. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. మీకెప్పుడూ నా హృదయంలో గురువు స్థానం ఉంటుంది. పవన్‌కల్యాణ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని అన్నారు.
వేడుకనుద్దేశించి తలసాని మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకకు రావటం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతుంటారు. పరిశ్రమకు సంబంధించి ఏదైనా సమస్య మా దృష్టికి వస్తే వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటారు. సింగిల్ విండో, 5వ షో, టికెట్ ధరలు.. ఇలా అన్ని విషయాల్లోనూ సానుకూలంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ బాగుండాలనేదే మా ఆకాంక్ష. పవన్ కల్యాణ్‌కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుందేగానీ తగ్గడంలేదు. జానపద కళాకారులకు ఆయన అవకాశం ఇవ్వడమనేది అభినందించాల్సిన విషయం. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అని ఆకాంక్షించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు మాగంటి గోపీనాథ్.
‘‘2017లో అనుకోకుండా సినిమా రంగంలో అడుగుపెట్టా. ‘భీమ్లా నాయక్’ చిత్రంతో నటిగా మరోసారి పుట్టాననిపిస్తోంది. ఇలాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించటం నాకెంతో సంతోషంగా ఉంది. లైట్‌బాయ్ నుంచి దర్శకనిర్మాతల వరకూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని కథానాయిక సంయుక్త మేనన్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్